స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతుందా.. సూపర్ ట్రిక్స్ తో చెక్ పెట్టేయండిలా..!

ఇటీవలే కాలంలో స్మార్ట్ ఫోన్( Smart Phone ) ఉపయోగించని వారు చాలా తక్కువ.

పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.

అందులోనూ ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్లే ఉంటాయి.ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సమయం దొరికినప్పుడల్లా సెల్ ఫోన్ తోనే చాలామంది కాలక్షేపం చేస్తూ ఉంటారు.

ప్రతిరోజు విచ్చలవిడిగా ఫోన్ ఉపయోగించడం వల్ల ఫోన్ హ్యాంగ్( Phone Hang ) అవుతూ ఉంటుంది.చాలామందికి అలా ఎందుకు ఫోన్ హ్యాంగ్ అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటారు.

కొంతమంది ఫోన్ హ్యాంగ్ అయితే రీస్టార్ట్ చేస్తూ ఉంటారు.ఇలా చేస్తే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.

Advertisement
Follow These Tricks To Resolve Smart Phone Hanging Problem Details, Mobile Trick

మరి స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ ఎందుకు అవుతుంది.హ్యాంగ్ అయితే ఏం చెయ్యాలో పూర్తిగా తెలుసుకుందాం.

Follow These Tricks To Resolve Smart Phone Hanging Problem Details, Mobile Trick

ఫోన్ క్లీన్ చేయడం:

స్మార్ట్ ఫోన్లో అంతర్గత స్పేస్ 20% కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఫోన్లో పనితీరు వేగం తగ్గుతుంది.అంటే ఫోన్లో స్టోరేజ్( Storage ) అధికంగా ఉంటే ఫోన్ హ్యాంగ్ అవుతుంది.కచ్చితంగా ఫోన్లో తగినంత స్పేస్ ఉండాలి.

ఎప్పటికప్పుడు ఫోన్లో అనవసర ఫైల్స్, అప్లికేషన్లను తొలగిస్తూ ఉండాలి.

Follow These Tricks To Resolve Smart Phone Hanging Problem Details, Mobile Trick

ఫోన్ రీస్టార్ట్ చేయడం:

స్మార్ట్ ఫోన్ ను రీస్టార్ట్( Phone Restart ) చేయడం వల్ల సాప్ట్ రీబూట్ బ్యాక్ గ్రౌండ్ యాప్లు, ప్రాసెస్ ల ద్వారా వినియోగించే వనరులు ఖాళీ అవుతాయి.అప్పుడు ఫోన్ యొక్క పనితీరు వేగంగా ఉంటుంది.ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారు కనీసం వారానికి ఒకసారి ఫోన్ ను రీస్టార్ట్ చేయాలి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

యాప్లను ఆన్ ఇన్స్టాల్ చేయడం:

ఫోన్లో ఉపయోగించని అనవసర యాప్ లను( Uninstall Apps ) అన్ ఇన్స్టాల్ చేసేయాలి.ఇలా చేస్తే బ్యాటరీ సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది.ఉపయోగించని యాప్ ల వల్ల ఫోన్లో స్టోరేజ్ పెరిగి స్పేస్ తక్కువగా ఉంది ఫోన్ హ్యాక్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు