జలకాలాటల్లో దంపతులు.. హఠాత్తుగా అక్కడికొచ్చిన మొసలి.. అప్పుడేమైందంటే

భార్యలతో టూర్లకు వెళ్లడం విదేశీయులతో పోలిస్తే మన దేశంలో తక్కువే.చాలా మంది విదేశీయులు వారాంతంలో సరదాగా భార్యాపిల్లలతో టూర్లకు వెళ్తుంటారు.

సంతోషంగా కొన్ని రోజులు గడిపి ఇంటికి వచ్చేస్తారు.ఫిషింగ్ చేయడం వారికి చాలా ఇష్టం.

ఇదే తరహాలో అమెరికాలోని ఫ్లోరిడాకు( Florida ) చెందిన వ్యక్తి తన భార్యతో విహారయాత్రకు వెళ్లాడు.దగ్గరలోని కాలువలో భార్యతో సరదాగా గడుపుతున్నాడు.

ఆ దంపతులు జలకాలాటలు ఆడుతున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది.ఓ భారీ మొసలి వారి వద్దకు వచ్చింది.

Advertisement

ఆ సమయంలో ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మన సమీపంలోకి ఏదైనా కుక్క వస్తేనే మనకు చాలా భయం వేస్తుంది.అయితే ఫ్లోరిడాకు చెందిన ఓ జంటకు వింత అనుభవం ఎదురైంది.కాలువలో జలకాలాటలాడుతున్న దంపతుల వద్దకు అకస్మాత్తుగా ఓ మొసలి వచ్చింది.

అలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే కంగారు పడిపోతారు.వెంటనే ఒడ్డుకు పరుగుపరుగున వెళ్లిపోతారు.

ప్రాణం దక్కించుకునేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు.అయితే ఫ్లోరిడాకు చెందిన ఆ దంపతులు మాత్రం చాలా నిశ్చింతగా అలాగే ఉన్నారు.

న్యూస్ రౌండర్ టాప్ 20

తాము తింటున్న శాండ్‌విచ్‌( Sandwich )ను ఆ మొసలికి తినిపించారు.ఆ మొసలి కూడా చక్కగా వారు తినిపించిన శాండ్‌విచ్ తిని అక్కడి నుంచి వెళ్లిపోయింది.చాలా ప్రేమగా ఆ మొసలిని పిలిచి, దానికి శాండ్‌విచ్ తినిపించిన ఆ వ్యక్తి ధైర్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

onlyinfloridaa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.ఏదేమైనా మొసళ్ల సంభోగ కాలం మే నుండి జూన్ వరకు ఉంటుంది.

అయితే కోర్ట్‌షిప్ కాలం మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది.ఈ తరుణంలో మొసళ్లకు( Crocodile ) ఇలా ఆహారం తినిపించడాన్ని అక్కడి ప్రభుత్వం సహించదు.2019లో, డేటోనా బీచ్‌లోని ఒక వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న మొసలికి ఆహారం పెట్టినందుకు అరెస్టు చేసి, 100 డాలర్ల జరిమానా విధించారు.

తాజా వార్తలు