ప్ర‌తి ఉదయం ఈ ఐదు పాటిస్తే రోజంతా సూపర్ ఎనర్జిటిక్ గా ఉంటారు.. తెలుసా?

రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాలనే అందరూ కోరుకుంటారు.కానీ అలా అందరికీ సాధ్యం కాదు.

కేవలం కొందరు మాత్రమే డే మొత్తం ఎంతో ఉత్సాహంగా పని చేస్తుంటారు.మరికొందరు మధ్యాహ్నానికే నీరసంగా మారుతుంటారు.

ఈ లిస్టులో మీరు ఉన్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ప్రతి ఉదయం ఇప్పుడు చెప్పబోయే ఐదు నియ‌మాలు పాటిస్తే రోజంతా సూపర్ ఎనర్జిటిక్ గా ఉంటారు.

మరియు ఆరోగ్యంగా, ఫిట్ గా మారతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐదు నియ‌మాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement
Five Rules To Stay Energized Throughout The Day! Five Rules, Health, Health Tips

ప్రస్తుత రోజుల్లో చాలామంది చేసే పొరపాటు ఉదయం ఆలస్యంగా మేల్కొనడం.కొన్ని అధ్యాయాల ప్రకారం ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారి కంటే త్వ‌ర‌గా మేల్కొనే వారు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారట‌.

ముఖ్యంగా ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో నిద్ర లేవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.మరి అలా మేల్కొనాలంటే రాత్రుళ్లు త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి.

Five Rules To Stay Energized Throughout The Day Five Rules, Health, Health Tips

కొందరికి కాళీ కడుపుతో కాఫీ తాగే అలవాటు( Coffee ) ఉంటుంది.కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఖాళీ కడుపుతో కాఫీని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది.

అందుకే ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుని అలవాటును వదులుకోండి.ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని సేవించాలి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

గంట అనంతరం ఒక గ్లాస్ లెమన్ మరియు హనీ మిక్స్ చేసిన‌ వాటర్ ను తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

Advertisement

తద్వారా రోజంతా ఎనర్జిటిక్( Energetic ) గా ఉంటారు.

వ్యాయామాలు( Exercise ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఉదయం కనీసం అరగంట అయినా వ్యాయామాలు చేయాలి.తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

మైండ్ రిఫ్రెష్ అవుతుంది.బాడీ రీఛార్జ్ అవుతుంది.

దీంతో రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బోండా, పూరి, దోశ, వడ వంటి అన్ హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవడం మానుకోండి.

ఉదయం ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు, పాలు, పెరుగు, నట్స్, ఓట్స్ వంటి ఆహారాలు తీసుకోవాలి.ఉదయం ప్రోటీన్ ను తీసుకోవడం వల్ల రోజంతా మన బాడీ ఎనర్జిటిక్ గా ఉండేందుకు సరిపడా శక్తి లభిస్తుంది.

అందుకే బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను ప్రిఫర్ చేయాలి.

తాజా వార్తలు