ఉగాది కానుకగా బ్లాస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఊహించని లుక్ లో బాలయ్య!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

( Anil ravipudi ) వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి ఇప్పుడు నటసింహం నందమూరి బాలయ్యతో( Balakrishna ) సినిమా తీస్తున్నాడు.

గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్ బాలయ్యను ఒప్పించి తనతో ఒక ఎమోషనల్ కథను తీయడానికి సిద్ధం అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం పూర్తి అయినట్టు తెలుస్తుంది.

ప్రజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఉగాది కానుకగా అదిరిపోయే మాస్ పోస్టర్ ను రివీల్ చేసారు.ఈ పోస్టర్ లలో బాలయ్య ఎవ్వరూ ఊహించని అవతార్ లో కనిపిస్తున్నారు.

బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనుండగా ఒక లుక్ వింటేజ్ బాలయ్యను తలపించేలా ఉంది.

First Look Of Nandamuri Balakrishna From Nbk108 Details, Balakrishna, Anil Ravip
Advertisement
First Look Of Nandamuri Balakrishna From NBK108 Details, Balakrishna, Anil Ravip

మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ తో అంచనాలు భారీ లేవల్లోకి పెరిగాయి.NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal agarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.

ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

First Look Of Nandamuri Balakrishna From Nbk108 Details, Balakrishna, Anil Ravip

అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.మొత్తానికి ఉగాది రోజు నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ అందుకుని బాలయ్య కెరీర్ లోనే మంచి ఊపులో ఉన్నాడు.

మరి ఇదే ఊపులో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బాలయ్య గట్టిగ డిసైడ్ అయ్యాడు.చూడాలి అనిల్ రావిపూడి బాలయ్యకు ఎలాంటి హిట్ అందిస్తాడో.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు