96తో అక్కడ మైమరిపించారు.. ఇక్కడ ఏం చేస్తారో?

తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమకథా చిత్రం 96, ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో తమిళ తంబీలు తమ ప్రేమ జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు.

ఈ సినిమా మ్యూజిక్ తమిళం అర్ధం కానీ వారికి కూడా ఆకట్టుకున్నాయంటే ఈ సినిమా ఎలాంటి భారీ విజయాన్ని అందుకుందో అర్ధం చేసుకోవచ్చు.అయితే గతంలోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు, ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జనవరి 7న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

మరి తమిళం బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

Advertisement
సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు