17 ఏళ్ళ తరువాత సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా..!!!

ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల నేరాలకి వివిధ శిక్షలు అమలు చేస్తూ ఉంటారు.

కొన్ని దేశాలలో తప్పు చిన్నది అయినా సరే ఎంతో కటినమైన శిక్షలు అమలు చేస్తారు.

అయితే ఉరి శిక్షలు విషయంలో మాత్రం అత్యంత దారుణమైన తప్పులు, దేశ ద్రోహం, హత్యలు ఇలాంటి విషయాలలో ఉరి శిక్షలని ఏ దేశంలోనైనా అమలు చేస్తారు.కానీ చాలా దేశాలలో ఉరి శిక్షల అమలు పై బ్యాన్ విధించినా పరిస్థితుల దృష్ట్యా వాటిని అమలు చేయక తప్పడం లేదు.

అయితే ఇలాంటి సందర్భమే అమెరికాలో చోటు చేసుకుంది.ఆ వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో ఉరి శిక్షను దాదాపు 17 ఏళ్ళ క్రిందట మాత్రమే అమలు చేశారు.ఆ తరువాత ఉరి శిక్ష అనే విషయాన్ని అమెరికా వ్యాప్తంగా దాదాపు మర్చిపోయారు.

Advertisement
Daniel Lewis Lee, America, Justice, First Federal Execution In 17 Years, Trump A

కానీ మరో మారు అంటే సుమారు 17 ఏళ్ళ తరువాత మళ్ళీ ఉరి శిక్షను అమలు చేసింది అమెరికా.జాతి వివక్ష తో రెచ్చిపోయిన డానియల్ లూయిస్ అనే వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా శ్వేత జాతీయులే ఉండాలి అనే ఆవేశంతో ఒకే కుటుంభానికి చెందిన భార్య భర్త, వారి బిడ్డను అత్యంత కిరాతకంగా హత్యలు చేశాడు.

ఈ హత్యలపై విచారణ జరిపిన తరువాత లూయిస్ పోలీసులకి పట్టుబడి కోర్టు ముందు ఎన్నో ఏళ్ళుగా హాజరుఅవుతూనే ఉన్నాడు.తాజాగా కోర్టు అతడిని ఉరి తీయమని ఆదేశాలు జారీ చేయడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు.

Daniel Lewis Lee, America, Justice, First Federal Execution In 17 Years, Trump A

అమెరికాలోని ఇండియానా స్టేట్ లోని హ్యూట్ ఫెడరల్ జైలులో ఇంజక్షన్ ఇచ్చి మరీ అతడికి ఉరి శిక్షని అమలు చేశారు.ముందుగా అతడి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని చెక్ చేసుకుంటూ ఇంజక్షన్ ఇచ్చారు.దాంతో అధికారులు అతడికి ఉరి శిక్షని అమలు చేశారు.

అయితే హత్య గావింపబడిన విలియం ముల్లర్ భంధువులు మాత్రం అతడిని ఉరి వేయవద్దని కోర్టుకి చెప్పినా శిక్షను అమలు చేసేశారు.శిక్షని అమలు చేసే ముందు నేను అమాయకుడిని అని అతడు అన్నట్టుగా అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు