ఆలస్యంగా వచ్చిందని ఆర్టీసీ బస్సుకు ఫైన్, ఎంతంటే?

ఆర్టసీ బస్సు నాలుగు గంటలు ఆలస్యంగా, గమ్య స్థానానికి చేర్చడంలోనూ మరో రెండు గంటలు జాప్యం చేయడం వల్ల ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది.

టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా రూ.1000, కేసు ఖర్చుల కింద మరో 500 రూపాయలు.మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో చెల్లించాలని తెలిపింది.

అయితే 2019వ సంవత్సరం ఆగస్టులో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్..

Fine For TSRTC Bus For Coming For Four Hours , Fine For Tsrtc, Fine To Rtc, Tsr

దిల్ సుఖ్ నగర్ నుంచి మణుగూరుకు ఆర్టీసీ బస్సులో టికెట్ బుక్ చేస్కుంది.బస్సు రాత్రి 7.15 గంటలకు ఉండగా.11.15 గంటకు బస్టాండుకు వచ్చింది.దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది.

అది చాలదన్నట్లు గమ్య స్థానానికి చేర్చడంలో కూడా చాలా లేటైంది.మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు బస్సు గమ్య స్థానానికి చేర్చాల్సి ఉండగా.9.45 కు చేర్చింది.ఎందుకు ఇంత ఆలస్యం అయిందని ఫహీమ డ్రైవర్ ను ప్రశ్నించగా.

Advertisement

దురుసుగా మాట్లాడాడు.అంతే కాకుండా బస్టాండులో నాలుగు గంటల పాటు వేచి ఉండటం, బస్సు ప్రయాణం మరింత పెరగడంతో ఫహీమ అస్వస్థతకు గురయ్యారు.

దీంతో ఫహీమ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.విచారించిన కమీషన్ ఆర్టీసీ బస్సు ఆలస్యం వల్లే ఫహీమ అస్వస్థతకు గైరనట్లు తేల్చింది.అందుకే తెలంగాణ ఆర్టీసీకి రూ.2, 131 జరిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు