పూరీ జగన్నాథ్ ను బాయ్ కాట్ చేస్తారా.. ఇది సాధ్యమేనా?

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.

ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో టీమ్ అంతా షాక్ అయ్యింది.ఇంతటి పరాజయాన్ని ఎవ్వరూ ఊహించలేదు.

ఇటు టీమ్ కానీ.అటు ప్రేక్షకులు కానీ ఈ ప్లాప్ ను ఉహించక పోవడంతో అందరికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.పూరీ, విజయ్ తమ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో భారీ స్థాయిలో, భారీ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు.

Advertisement

అయితే ఎన్ని అంచనాలు పెట్టుకున్నారు అంత ప్లాప్ అయ్యింది.ఇదిలా ఉండగా ఈ సినిమా సెటిల్మెంట్ వ్యవహారం ఇప్పుడు మరింత వివాదం అయ్యింది.

లైగర్ డిజాస్టర్ తో నష్టపోయిన వారికీ సెటిల్ చేయాలని పూరీ ఒప్పుకున్నాడు.అయితే సమయం గడుస్తున్న ఇంకా అమౌంట్ రాకపోవడంతో పూరీ ఇంటి ముందు ధర్నా దిగాలని నిర్ణయించు కున్నారు.

దీంతో పూరీ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.ఈ వివాదం పోలీసుల వరకు వెళ్లడంతో మరింత ముదిరింది.

అందుకే ఫైనాన్షియర్లు అందరు కలిసి ఇకపై పూరీ సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టు రూమర్స్ వినిపించాయి.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

అంతేకాదు భవిష్యత్తులో ఈయన సినిమాలను డిస్టిబ్యూట్ కూడా చేయకూడదని ఇతడిని బాయ్ కాట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కానీ ఎవరైనా ఒక దర్శకుడి సినిమాలను బాయ్ కాట్ చేయడం అంత సాధ్యం కాదు.ఈయన సినిమాలపై బ్యాన్ చేస్తే ఆయన సినిమాల్లో నటించే అందరి మీద బ్యాన్ విధించినట్టే అవుతుంది.

Advertisement

లైగర్ సొంత బ్యానర్ మీద చేసాడు కాబట్టి వ్యవహారం మొత్తం ఈయన మెడకు చుట్టుకుంది.అందుకే ఒక దర్శకుడిని బాయ్ కాట్ చేయడం అనేది సాధ్యం కానీ పని.

తాజా వార్తలు