Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ అరెస్టుపై స్పందించిన సిరి హనుమంత్.. ఏమన్నారంటే?

షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) పరిచయం అవసరం లేని పేరు.

యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వచ్చారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో విన్నర్ గా నిలుస్తారు అనుకున్నటువంటి షణ్ముఖ్ మరొక కంటెస్టెంట్ సిరి హనుమంతు తో కలిసి కాస్త క్లోజ్ గా మూవ్ అవడంతో వీరిద్దరి గురించి బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది.ఇలా వీరిద్దరు హౌస్ లో క్లోజ్ గా ఉండడంతో షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునయన ( Deepthi Sunaina ) తనకు బ్రేకప్ చెప్పేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన గంజాయి తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.

Finally Siri Hanumanth Open Up Shanmukh Jaswanth Arrest

ఆయన తన ఇంట్లో గంజాయి తీసుకుంటున్నారని పోలీసుల అరెస్టు చేయడమే కాకుండా తన వద్ద నుంచి కొంత మొత్తంలో గంజాయి తీసుకున్నారు.అయితే విచారణలో భాగంగా తాను డిప్రెషన్( Depression ) లో ఉన్నానని, తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయని అందుకే తాను గంజాయి తీసుకున్నానని తెలిపారు.ప్రస్తుతం షణ్ముఖ్ బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

Finally Siri Hanumanth Open Up Shanmukh Jaswanth Arrest
Advertisement
Finally Siri Hanumanth Open Up Shanmukh Jaswanth Arrest-Shanmukh Jaswanth : ష

ఇకపోతే ఈయన అరెస్టు కావడం గురించి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సిరి హనుమంత్( Siri Hanumanth ) స్పందించారు.తాజాగా ఈమె షణ్ముఖ్ అరెస్టు( Shanmukh Arrest ) గురించి మాత్రమే కాకుండా బిగ్ బాస్ తర్వాత తనని కలవకపోవడం గురించి కూడా స్పందించారు.తన పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని తాను అసలు ఊహించలేదని తెలిపారు.

ఇక తనని కలవకపోవడం గురించి మాట్లాడుతూ తనకు బ్రేకప్ జరిగిన తర్వాత తిరిగి తనతో కలవడం కరెక్ట్ కాదు అందుకే నేను తనని ఎప్పుడు కలవలేదని సిరి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు