ఆ సినిమా కోసం బయటకొస్తున్న అల్లు అర్జున్.. బన్నీ స్పీచ్ హైలెట్ కానుందా?

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కీ మొదటి వరకు కోర్టులు, పోలీస్ స్టేషన్లు, వివాదాలు, బెయిల్ అంటూ ఆ పనులతోనే సరిపోయింది.

తను నటించిన పుష్పన 2 సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయారు అల్లు అర్జున్.

ఈ దెబ్బతో అల్లు అర్జున్ బయట పెద్దగా కనిపించడమే మానేశాడు.తన సినిమా విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నాడు.

తన సినిమాలు సక్సెస్ అయిన వెంటనే ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా ట్రిప్ కు వెళ్లి అల్లు అర్జున్ ఈసారి మాత్రం అలా వెళ్లలేదు.కనీసం బయటకు కూడా రాలేదు.

Finally Allu Arjun Step Out For A Movie Function After Stampede, Allu Arjun, Tha

పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) విడుదల సమయంలో జరిగిన సంఘటనతో అసలు బయట కనిపించడమే మానేశాడు అల్లు అర్జున్.అయితే ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇప్పుడు బయట కనిపించబోతున్నాడట.అది కూడా వేదిక పైకి రాబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Finally Allu Arjun Step Out For A Movie Function After Stampede, Allu Arjun, Tha

అల్లు అరవింద్ ( Allu Arvind )నిర్మించిన తండేల్ ప్రచారం కోసం బయటకొస్తున్నాడు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో బన్నీ కనిపించడం ఇదే తొలిసారి.

తండేల్ రాజు కోసం పుష్పరాజ్ వస్తున్నాడంటూ ఇప్పటికే యూనిట్ ప్రచారం షురూ చేసింది.మరి తండేల్ సినిమా( Tandel movie ) ప్రచార కార్యక్రమాలకు రాబోతున్న అల్లు అర్జున్ గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఎదురవుతాఏమో, అల్లు అర్జున్ కూడా ఆ ఘటనలపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Finally Allu Arjun Step Out For A Movie Function After Stampede, Allu Arjun, Tha

ఇకపోతే తండేల్ సినిమా విషయానికి వస్తే.చందు ముండేటి ( Chandu Mundeti )దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెలిసిందే.ఇందులో సాయి పల్లవి నాగచైతన్యలు జంటగా నటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఈ సినిమా విడుదల అయ్యి తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు