బీజేపీ గూటికి చేరనున్న సినీ నటి సుమలత..!

సినీ నటి సుమలత, మాండ్యా ఎంపీ సుమలత( Mandya MP Sumalatha ) బీజేపీ( BJP ) గూటికి చేరనున్నారు.

ఈ క్రమంలో కాషాయ కండువా కప్పుకోనున్న ఆమె రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హెచ్.

డి కుమారస్వామికి( HD Kumara Swamy ) మద్ధతు ఇస్తానని ప్రకటించారు.సుమలత తాజా ప్రకటన నేపథ్యంలో మాండ్యా ఎంపీ స్థానం నుంచి ఆమె సారి బరిలో నిలవడం లేదని తెలుస్తోంది.

గతంలో మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత బీజేపీ మద్ధతుతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే తాను మాండ్యా నియోజకవర్గం నుంచి ఎక్కడికీ వెళ్లడం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆమె తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు