ఏపీ ఎన్నికల సరళి పై సినీ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు పోలింగ్ ముగిసింది.ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ లో పాల్గొన్నారు.

ఈసారి అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.దీంతో దేశంలో నాలుగు దశలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధికంగా ఏపీలో ఏకంగా 81.86% పోలింగ్ జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలియజేయడం జరిగింది.ఇదిలా ఉంటే సీనియర్ నటుడు నరేష్( Naresh) ఏపీ ఎన్నికల సరళి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

"ఏపీలో ఎన్నికల పోరు ముగిసింది.ఓటర్లు తీర్పు ఇచ్చారు.ప్రజలకు అత్యంత ఇష్టమైన నాయకులు గెలవాలని, శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

Advertisement

దీంతో నరేష్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఏపీ పోలింగ్ జరగకముందే ఎన్నికల సమయంలో అనేక గొడవలు జరుగుతాయని నరేష్ ముందుగానే హెచ్చరించారు.

ఇప్పుడు ఆ రీతిగానే పల్నాడు, అనంతపురం ప్రాంతాలలో హింసాత్మకమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.దీంతో లేటెస్ట్ గా సినీ నటుడు నరేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఈసారి ఏపీ ఎన్నికలలో చాలామంది సినిమా నటులు ప్రచారంలో పాల్గొన్నారు.ప్రధానంగా పిఠాపురం( Pithapuram) లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.

వ్యాయామాల‌ త‌ర్వాత ఈ డ్రింక్స్ తాగితే సూప‌ర్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు