నేడు ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ స్టార్ట్ అయ్యింది.29 రోజులపాటు జరగనున్న ఈ టోర్నీలో 32 టీమ్స్ తలపడనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఈ గేమ్ లో ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకునే జట్టుకు కాసులు పంట పండనుంది.
ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ జట్టుకు.ప్రైజ్ మనీ రూ.341 కోట్లు (4 కోట్ల 20 లక్షల డాలర్లు), రన్నరప్ రూ.244 కోట్లు(3 కోట్ల డాలర్లు), మూడో స్థానం రూ.219 కోట్లు(2 కోట్ల 70 లక్షల డాలర్లు).ఇలా దిగువ జట్లకు కూడా ప్రైజ్ మని ప్రకటించడం జరిగింది.
కాగా నేడు ఖతర్ రాజధాని దోహాలో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా అటహాసంగా స్టార్ట్ అయింది.లేజర్ లైట్ షోలతో మైమరిచే సంగీతంతో అల్ బేత్ స్టేడియం హోరేతింది.
కొరియన్ సంగీత బృందం బీటీఎస్ కు చెందిన జంగ్ కూక్ స్టేజి షో ఇవ్వడం మాత్రమే కాదు.ఖతర్ గాయకుడు ఫహాద్ అల్ కుబైసీతో కలిసి టోర్నమెంట్ గీతాన్ని ఆలపించాడు.
ఇంకా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లెజెండ్ మోర్గాన్ ఫ్రీమన్ స్టేడియం మధ్యలో ప్రపంచ ఐక్యతను ఉద్దేశించి స్పీచ్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి అరబ్ దేశాల అధినేతలు సౌదీ అరేబియాకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ఖతర్.ఈక్వేడర్ టీమ్స్ మధ్య జరగనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy