వీడియో: తాచుపాము, ముంగిసల మధ్య భీకర ఫైట్.. ఏది గెలిచిందంటే..

కింగ్‌ కోబ్రాని తెలుగువారు రాచనాగు, తాచుపాము అని పిలుస్తుంటారు.ఈ పాము విషం మనుషులను కొద్ది నిమిషాల్లోనే చంపగలదు.

అంత విషపూరితమైన ఈ పామును చూస్తే పులులు, సింహాలు సైతం వణికిపోయి పారిపోతాయి.ఇవి కాటేస్తే బతకడం అసాధ్యం.

అందుకే వీటి జోలికి ఇతర జంతువులు వెళ్లవు.కానీ ఒక చిన్న క్షీరదం మాత్రం నాగు పాములతో ఒక ఆట ఆడుకుంటుంది.

వీటిని సులభంగా చంపేస్తుంది కూడా.అదే ముంగిస.

Advertisement

ముంగిసలలో ఉండే ప్రత్యేకమైన ఎసిటైల్కోలిన్ గ్రాహకాలు విషానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి.అంటే పాముల విషం వీటిని ఏం చెయ్యలేదు.

ఇప్పటికే మీరు పాములు, ముంగిసల మధ్య జరిగిన ఫైటింగ్ వీడియోలు ఎన్నో చూసి ఉంటారు.అయితే ఇలాంటి పోట్లాటలు చాలా తక్కువగా కెమెరాలకి దొరుకుతుంటాయి.

కాగా తాజాగా ఇలాంటి అరుదైన వీడియో వైరల్‌గా మారింది.దీనిని వైల్డ్‌ యానిమలియా అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు షేర్ చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు మొదటగా ఒక బురద నీటి మడుగులో ఒక నల్ల నాగుపాము కనిపిస్తుంది.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

ఆ నీటికి ముందే ఒక ముంగిస ఉంది.ఈ ముంగిస చిన్నగా ఉన్నా కూడా ఆ పెద్ద పాముపై దాడికి యత్నించింది.

Advertisement

దాన్ని ఎదుర్కొనేందుకు నాగుపాము పెద్దగా బుసలు కొడుతూ చాలా సార్లు కాటు వేసింది.

ముంగిస ఈ స్నేక్‌ బైట్స్‌ను చాకచక్యంగా తప్పించుకుంది.ఈ రెండు చాలా సేపు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.కోబ్రా ముంగిస నుంచి తన ప్రాణాలు రక్షించుకునేందుకు శాయశక్తులా యత్నించింది.

పాము తప్పించుకోవాలని ఎంత సేపు ప్రయత్నించినా ముంగిస మాత్రం దానిని వదిలిపెట్టలేదు.దాని చుట్టూ తిరుగుతూ దానిపై దాడి చేస్తూనే ఉంది.

అప్పటికే పాము చాలా వరకు అలసిపోయినట్లు అనిపించింది.చివరికి పాము చనిపోయిందా లేక తప్పించుకొని పారిపోయిందా అనేది వీడియోలో కనిపించలేదు.

కాగా వీటి పొట్లాటపై నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్.13వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు