అందరినీ ఒక్కటి చేసేవి పండుగలే – మంచు మనోజ్‌

ఎన్ని సమస్యలున్నా, ఎన్ని మనస్పర్థలున్నా అందరినీ ఒక్కటి చేసేవి పండుగలే అని తనకు పండుగలు అంటే చాలా ఇష్టమని మంచు మనోజ్‌( Manchu Manoj ) అన్నారు.

సోమవారం అయ్యప్ప సొసైటీలో ఎర్రగుడ్ల వెంకట్‌ యాదవ్, షణ్ముక్‌ యాదవ్, రంజిత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన తన సతీమణి భూమా మౌనికతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మనోజ్, మౌనిక దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.నగరంలో జరిగే బోనాలా వేడుకలు అంటే తనకు ఎంతో ఇష్టమని పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, యువకుల ఉత్సాహం తనకు ఎంతో నచ్చుతాయని అన్నారు.

అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.ఫలహారం బండి ఊరేగింపు సందర్భంగా పోతరాజులు, శివసత్తులు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

అనంతరం వందలాదిగా విచ్చేసిన బస్తీవాసులు, భక్తుల నడుమ అమ్మవారి ఊరేగింపు ఉత్సాహభరిత వాతావరణంలో ముందుకు సాగింది.

Advertisement
స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

తాజా వార్తలు