దూసుకొస్తున్న ట్రైన్ కింద పడ్డ తండ్రి, కొడుకునీ లాక్కెళ్లగా..!

ఆరేళ్ల కొడుకుతో కలిసి దూసుకు వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.

రైలు ఆ వ్యక్తి మీద నుండి వెళ్లడంతో అతడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.అసలేం జరిగిందంటే.

అది మహారాష్ట్రలోని ఠాణె.విఠల్ వాడీ రైల్వే స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు.వెంట తన ఆరేళ్ల కొడుకును కూడా తీసుకు వచ్చాడు.

అదే సమయంలో డెక్కన్ ఎక్స్ ప్రెస్ ముంబయి నుండి పుణె కు వెళ్తోంది.వేగంగా వెళ్తున్న ఆ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

Advertisement

ఆ వ్యక్తి.తన ఆరేళ్ల బాబుతో కలిసి ఆత్మహత్యకు యత్నించాడు.

ఈ ఘటనలో ఆ వ్యక్తి రైలు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యాడు.ఆరేళ్ల బాబు మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు.

మృతుడిని ప్రమోద్ అంధాలేగా మహారాష్ట్ర ఠాణె పోలీసు అధికారులు గుర్తించారు.ఉల్హాస్ నగర్ ప్రాంతంలోని శాంతి నగర్ లో అతడు నివాసం ఉంటున్నాడని తెలిపారు.

బుధ వారం సాయంత్రం ప్రమోద్ అంధాలే తన కొడుకుతో కలిసి రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల ఆధారంగా అధికారులు వెల్లడించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

ప్లాట్ ఫాంపై నిల్చున్న ప్రమోద్ అంధాలే.రైలు రావడాన్ని గుర్తించి.

Advertisement

దూరంలో ఉన్న తన కొడుకుని దగ్గరకు తీసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.ఆ తర్వాత రైల్వే ట్రాక్ పైకి దూకినట్లు అధికారులు గుర్తించారు.

తాజా వార్తలు