సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.మునగాల శివారు ప్రాంతంలో ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ సుమారు 50 మీటర్ల దూరం లాక్కెల్లిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో 30 మంది ఉన్నారు.మృతులంతా మునగాలకు చెందిన వారుగా గుర్తించారు.

Advertisement

అయ్యప్పస్వామి గుడిలో పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు