పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

పల్నాడు జిల్లా( Palnadu district )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.పసుమర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు.మరో ఇరవై మందికి గాయాలు అయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.

బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు