మన్యం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.కొమరాడ మండలం చోళవరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఆటోను లారీ ఢీకొట్టింది.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు