పద్మనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొన్న లారీ

పద్మనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.బైకును ఢీకొన్న లారీ.

వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎక్సెల్ వాహనంపై సిరిసిల్ల వైపు వెళ్తున్న అంకుషా పూర్ కు చెందిన రేగుల రాములును వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టింది.కింద పడిపోగా తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతోఅక్కడికక్కడే మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!