Super star krishna fans: సముద్ర తీరంలో కృష్ణ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి అభిమానుల నివాళులు..

సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన సాండ్ ఆర్టిస్ట్ సనత్ కుమార్ సముద్ర తీరంలో కృష్ణ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు.

సినీ రంగానికి సూపర్ స్టార్ కృష్ణ మృతి తీరని లోటని అన్నారు.తెలుగు సినిమా క్యాతిని నలు దిశల వ్యాప్తి చేసిన ఘనత కృష్ణకే దక్కిందని కొనియాడారు.

ఆయన ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంది.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement