సూర్య పేలవ ప్రదర్శనపై అభిమానులు ఫైర్..!

సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) అంటే గతంలో ఐపీఎల్ అయినా.

అంతర్జాతీయ క్రికెట్ అయినా పరుగుల వరద పారిస్తాడు అని అందరికీ తెలిసిందే.

గ్రౌండ్లో దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టించి, మైదానం నలువైపులా షాట్లు కొడుతూ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.టీ -20 క్రికెట్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ పెంచుకున్న సూర్య కుమార్ యాదవ్ 2022లో రాణించినంతగా, 2023లో రాణించలేకపోతున్నాడు.

ఒకరకంగా ఈ 2023 వ సంవత్సరం సూర్య కుమార్ యాదవ్ కు కలిసి రాలేదని చెప్పాలి.ఎందుకంటే 2023లో ఆడిన ఏ మ్యాచ్ లోను చెప్పుకోదగ్గ పరువులు నమోదు చేయలేకపోయాడు.

ప్రస్తుతం ఫామ్ కోల్పోయి గ్రౌండ్లో తంటాలు పడుతున్నాడు.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్( Delhi Capitals - Mumbai Indians ) మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ముంబై తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య మొదటి బాల్ కే అవుట్ అయి వెనుదిరిగాడు.

Advertisement

సూర్య ఆడిన గత ఆరు మ్యాచ్లను పరిశీలిస్తే మొదటి బంతికే అవుట్ కావడం ఇది నాలుగోసారి.ఆరు మ్యాచ్లలో 0(1), 0(1), 0(1), 15(16), 1(2), 0(1) పరుగులు చేసి అభిమానులను నిరాశపరిచాడు.ఆస్ట్రేలియాతో ( Australia )జరిగిన వన్డే సిరీస్ నుండి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి పరుగులు చేయకుండానే అవుట్ అవుతున్నాడు.

కనీసం క్రీజూ నిలబడడానికే నానా తండాలు పడుతున్నాడు.ఐపీఎల్ లో కూడా సూర్యకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి.ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో నిరాశ పరిచాడు.

ఇలానే కొనసాగితే త్వరలో ప్రపంచ కప్ సమయంలో సూర్యకు జట్టులో అవకాశం దక్కే అవకాశాలు చాలా తక్కువ.కాబట్టి ప్రస్తుతం సూర్య ఫామ్ లోకి రావాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఆశిస్తోంది.

సూర్య కుమార్ యాదవ్ ఆట ప్రదర్శన పై సోషల్ మీడియాలో అభిమానులు విమర్శిస్తున్నారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement