సీఎం జగన్ ని కలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు..!!

సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు.ఇటీవల టీటీడీ ధార్మిక సలహాదారుడుగా చాగంటి నియమితులయ్యారు.

ఈ సందర్భంగా చాగంటిని సత్కరించి.శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు సీఎం జగన్.

ఇదే సమయంలో శాంత బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్ ఎండి డాక్టర్ కే.ఐ.వరప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలవడం జరిగింది.ఈ క్రమంలో తనని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుడిగా నియమించటంతో మొదటిసారి సీఎం జగన్ ని కలసిన చాగంటి కోటేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

అయితే సీఎంతో సమావేశం అనంతరం.ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉన్న గోశాలను చాగంటి కోటేశ్వరరావు వరప్రసాద్ రెడ్డి సందర్శించారు.గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దడంతో చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు.

Advertisement

తెలుగు రాష్ట్రాలలో చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా మంచి పేరు సంపాదించడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఫుడ్ కార్పొరేషన్ లో కూడా.

పనిచేయడం జరిగింది.చాగంటి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు.

Advertisement

తాజా వార్తలు