ఏపీలో ఏప్రిల్ 6 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయడానికి రెడీ అయ్యారు.

ఇప్పటికే  ప్రజా సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా మార్చి 23 నుంచి "జగనన్నకు చెబుదాం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ కావడం జరిగింది.

స్పందనలో వచ్చిన ఆర్జీల ట్రాకింగ్.పర్యవేక్షణకీ సంబంధించి ప్రతి మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

అనంతరం సీఎం జగన్ కి నివేదికలు అందిస్తారు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో "ఫ్యామిలీ డాక్టర్" కాన్సెప్ట్ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్ 6 నుంచి అమలు చేయటానికి రెడీ అయింది.ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్య వివరాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా.వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుందట.

Advertisement

ఇదే తరహా కార్యక్రమం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది.ఢిల్లీలో నెలలో రెండుసార్లు వైద్యులు గ్రామాలలో సందర్శిస్తారు.

ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వారి యొక్క పూర్తి ఆరోగ్య వివరాలు మొబైల్ అప్లికేషన్ తరహాలో పొందుపరుస్తారు.ఢిల్లీలో బాగా సక్సెస్ కావడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు