కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం మానుకోవాలి..: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్ పై కుట్ర పూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని తమపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం చేతికాకపోయినా తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

False Propaganda On Congress Should Be Avoided..: Revanth Reddy-కాంగ్�

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేతకాక కేసీఆర్ ఛత్తీస్ గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే ఏ సబ్ స్టేషన్ కు అయినా వెళ్దామన్న రేవంత్ రెడ్డి ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నారో చూపించాలని సవాల్ చేశారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ పై అసత్యాలు చెప్పడం మానేయాలని హితవు పలికారు.

Advertisement
మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు