DSP Nalini : తెలంగాణ కోసం రాజీనామా చేసిన డీఎస్పీ నళిని గుర్తుందా ? ఆమె జీవితం ఎలా మారిందో తెలుసా ?

మీ అందరికీ తెలంగాణ ఉద్యమంలో ఏకంగా డిఎస్పి స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని( Nalini ) గుర్తుండే ఉంటుంది తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న వారిపై లాటి జులిపించలేనని చెప్పి తన కొలువుకు రాజీనామా చేసింది డీఎస్పీ నళిని.తెలంగాణ ఉద్యమం కోసం చిన్నచిన్న పనులు చేసిన వారు కూడా పెద్ద ఎత్తున బహుమానాలందరి అంతే కాదు బాగా డబ్బులు కూడా సంపాదించుకున్నారు మంచి కొలువుల్లో స్థానాలు పొందారు.

కానీ డిఎస్పి స్థాయి అంటే మామూలు విషయం కాదు ఆమె గురించి అప్పటి తెలంగాణ పార్టీ పట్టించుకోలేదు ప్రస్తుతం ఇలాంటి వారి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది.టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిందని అంతటి స్థాయి వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేస్తే కనీసం పట్టించుకోలేదని ప్రభుత్వం వచ్చాక ఆమె కోసం ఎలాంటి కొలువు ఇప్పించలేదని చాలామంది మొహం మీదే చెప్పేవారు.

ఢిల్లీ( Delhi )లో రెండుసార్లు పోరాటం చేసిన ఆమె గోడు ఎవరూ వినలేదు.అయితే ప్రస్తుతం నళిని పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఎవరికీ తెలియదు.రేవంత్ ప్రభుత్వం( Revanth reddy ) కొలువుతీరిన తర్వాత నళిని గురించి చర్చ జరుగుతుంది.

ఆమె ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే ఆమె ప్రస్తుతం పూర్తిగా త్యాగాల నుంచి వేదాల వైపు తన మనసును మలుచుకుంది.ఆర్ష కవిగా కొనసాగుతుంది.పైగా పూర్తిగా ఫిజికల్ ఫిట్నెస్ ని కోల్పోయానని నేను ఇప్పుడు పూర్తిగా పోలీసు ఉద్యోగానికి న్యాయం చేయలేనని ఆరోగ్యం పూర్తిగా పోయిందని ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా ఎవరో ఒకరు హైకోర్టులో పిల్ వేసి ఆపేస్తారని ఇంకా జీవచ్ఛవంగా చేస్తారని భయంతో అలాంటి పనులు కూడా చేయట్లేదు అని చెబుతోంది నళిని.

Advertisement

ఇన్నేళ్ల తర్వాత కూడా తనను అందరూ గుర్తుపెట్టుకున్నందుకు సంతోషంగా ఉన్నా నేను పూర్తిగా వేద మార్గంలో వెళుతున్నానని దైవచింతనలో బతుకుతున్నానని సాత్వికంగా ఉంటున్నానని తెలిపారు.ఒకప్పుడు త్యాగం చేశాను ఇప్పుడు వేద యజ్ఞం చేస్తున్నాను అంటూ ఎంతో హృదయ విధానంగా ఆమె చెప్పిన తీరు చూసి పలువురు కంటతడి పెడుతున్నారు.

ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు