ఎఫ్‌ 3 కి బ్యాడ్‌ టాక్‌... దిల్‌ రాజుకు ఈ సారి దెబ్బ పడబోతుందా?

వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్ కలిసి నటించగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన ఎఫ్ 3 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరి లో వ్యక్తం అవుతూ ఉండగా విడుదల అయిన ట్రైలర్‌ కొందరికి అనుమానాలు కలిగిస్తుంది.

ఎఫ్ 2కు ఏమాత్రం తగ్గకుండా ఎఫ్‌ 3 కామెడీ తో ఆకట్టుకోబోతుంది.

పైగా వెంకటేష్‌ రేయి చీకటితో మరియు వరుణ్‌ తేజ్ నత్తి తో కనిపించబోతున్నారు.కనుక ఇద్దరు మస్త్‌ ఫన్‌ ను క్రియేట్‌ చేయడం ఖాయం.

కాని గతంతో పోల్చితే ఇప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాలు మరియు అభిరుచులు చాలా వరకు మారుతున్నాయి.కనుక మారుతున్న పరిస్థితుల అనుగుణంగా ప్రతి ఒక్కరు మారాల్సిందే.

అలా మారకుంటే ఖచ్చితంగా దెబ్బ పడటం ఖాయం.ఆచార్య సినిమా ఫలితం అందుకు ఉదాహరణ అనడంలో సందేహం లేదు.

Advertisement

ఇప్పుడు ఎఫ్ 3 సినిమా యొక్క ట్రైలర్‌ ను చూసిన తర్వాత కొందరు స్పందిస్తూ రెగ్యులర్ బూతు కామెడీ మరియు ఎఫ్‌ 2 కంటే కొత్తగా ఏమీ ఉండక పోవచ్చు అంటున్నారు.రొటీన్ కామెడీని ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఆధరిస్తారు.

కాని యూత్‌ ఆడియన్స్ రావాలంటే మాత్రం కాస్త కొత్తదనం కావాల్సి ఉంది.

అది ఎఫ్ 3 లో ఎంత వరకు ఉంది అంటే ట్రైలర్‌ చూసిన తర్వాత లేదేమో అనిపిస్తుంది.సినిమా లో వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్‌ లు మాత్రమే కాకుండా సునీల్‌.కిషోర్ మరియు రాజేంద్ర ప్రసాద్‌ కూడా ఉండటం తో ఫన్ అయితే పక్కాగా ఉంటుంది.

యూత్‌ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయితే ఖచ్చితంగా మంచి ఫలితం దక్కే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ 3 పై యూత్‌ ఆడియన్స్ దృష్టి లేకున్నా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం పడి చస్తున్నారు అనడం లో సందేహం లేదు.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?
Advertisement