గ్లామర్ బ్యూటీలు ఉన్నా ఎఫ్ 3 కి సెన్సార్ 'యు' సర్టిఫికేట్ ఎలా సాధ్యమయ్యిందబ్బా?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రెసెంట్ ఎఫ్ 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.2 గంటల 28 నిముషాల నిడివితో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లిన్ యు సర్టిఫికెట్ జారీ చేసారు.అయితే ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ వంటి హాట్ గ్లామరస్ బ్యూటీలు ఉన్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు నుండి క్లిన్ యు సర్టిఫికెట్ ఎలా పొందింది అసలు అనిల్ ఇంత మంది బ్యూటీలను సినిమాలో పెట్టుకుని ఎలా యు సర్టిఫికెట్ పొందాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.

Advertisement
F3 Movie Clears Censor Certification, Censor Certification, F3 Movie, Dil Raju,

మరి యు సర్టిఫికెట్ ఎలా సాధించారో తెరపై చుస్తే కానీ తెలియదు.

F3 Movie Clears Censor Certification, Censor Certification, F3 Movie, Dil Raju,

ఈ కామెడీ సినిమాలో సునీల్, అలీ, మురళీ శర్మ, ప్రగతి, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 21 2022 న హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో జరగనుంది.

మరి ఈ సినిమా ఏ స్థాయిలో నవ్విస్తుంది చూడాలి.టికెట్ రేట్స్ కూడా పెంచక పోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూడడానికి రెడీ అయిపోతున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు