నిర్మల్ జిల్లా ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత

నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

విద్యార్థి సంఘాల నాయకులతో పాటు బీజేపీ యువ మోర్చా నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినీ మృతిపై విద్యార్థి సంఘ నేతలు నిరసనకు దిగారు.ప్రభుత్వం స్పందించి మృతిచెందిన విద్యార్థినీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్రిపుల్ ఐటీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్య ఘటనలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు కోరుతున్నారు.లేని పక్షంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ క్రమంలో నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Advertisement
Bet Plays Mobile App And Mobile Experience : A Practical Guide For Canadian Players

Latest Latest News - Telugu News