తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల విస్తృత తనిఖీలు

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు( Drug Control Officers ) విస్తృత తనిఖీలు నిర్వహించారు.

నిజామాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోని మెడికల్ షాపులపై( Medical Shops ) ఆకస్మిక దాడులు చేశారు.

గండిపేట్ లోని మెడికల్ షాపుల్లోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు.ఈ క్రమంలోనే ఆయుర్వేద మందు ఆర్థో విన్ గోల్డ్ ఆయిల్ మందులను అధికారులు సీజ్ చేశారు.

న్యుమోనియా, డయాబెటీస్ చికిత్సకు ఉపకరిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.నిజామాబాద్ జిల్లాలోని( Nizamabad District ) పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసిన అధికారులు ఆయుర్వేద మందు ఆమ్లా జ్యూస్ ను సీజ్ చేశారు.

ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు