కువైట్ పై మండిపడుతున్న ప్రవాసులు..ఇదేం దిక్కుమాలిన నిర్ణయం...!!!

కువైట్ గత కొంతకాలంగా తమ దేశంలో ఉండే ప్రవాసులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది.తమ దేశం రండి ఉద్యోగాలు చేసుకొండి అంటూ గతంలో ఆహ్వానం అందించిన కువైట్ ఇప్పుడు పలు రకాల నిభంధనలు అమలు చేస్తూ మెడ పట్టి మరీ ప్రవాసులను వెళ్ళగోడుతోంది.

ఏళ్ళ తరబడి కువైట్ ను ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న ఎంతో మంది ప్రవాసులు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్న ప్రళంగా తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు.2017 లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీను అనుసరిస్తూ నేడు వేలాది మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచీ తొలగిస్తోంది.అంతేకాదు.

కేవలం ప్రవైటు రంగంలోని ప్రవాసులను మాత్రమే కాదు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రవాసులను తొలగిస్తూ తాజాగా నిర్ణయం కూడా తీసుకుంది.ఈ చర్యలకే ఆందోళన చెందుతున్న ప్రవాసులకు మరో సారి బిగ్ షాక్ ఇస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది కువైట్ ప్రభుత్వం.

ప్రవాసులను తమ దేశం నుంచీ పోమ్మనకుండా పొగ బెడుతున్న కువైట్ మరో నిర్ణయంతో విమర్సల పాలవుతోంది.అదేంటంటే.

తాజాగా.కువైట్ లోని వైద్య ఆరోగ్య శాఖ ఇకపై వలస వాసులు ఎవరైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవడం కుదరదని, ప్రవాసులు ఎవరైనా సరే ప్రవైటు ఆసుపత్రులలోనే వైద్యం చేయించుకోవాలని సూచించింది.

Advertisement

కువైట్ మీడియా కధనాల ప్రకారం.కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రవాసులను ప్రభుత్వ ధవఖానాలకు బదులుగా ధామస్ లోని హెల్త్ హాస్పటల్ కు తరలిస్తున్నారట.

ఇకపై ప్రవైటు సెక్టార్ లోని ప్రవాస కార్మికులు అందరిని సదరు ప్రవైటు ఆసుపత్రికే తరలించనున్నారట.అయితే ప్రభుత్వ సెక్టార్ల లో పనిచేసే వారు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చునని కానీ ఇది కేవలం కొంత కాలం వరకే కుదురుతుందని వైద్య శాఖాధికారులు తెలిపారట.

ఒక వేళ అత్యవసర సేవలకు మాత్రం ప్రవైటు ధవఖానాలకు వెళ్ళవచ్చునని క్లారిటి ఇచ్చింది కువైట్ ప్రభుత్వం.కాగా ఈ నిర్ణయం పట్ల ప్రవాసులు ఆందోళన చెందుతున్నారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు