రేపు సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఈసీ కీలక ఆదేశాలు..!!

దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.రేపు చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పై( Exit Polls ) కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది.ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది.దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి.

Advertisement

దీంతో ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.ఈసారి కాంగ్రెస్ పుంజుకోవటంతో ఇండియా కూటమి( India Alliance ) నేతలు అధికారం పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని బీజేపీ( BJP ) నాయకులు భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి 80% పోలింగ్ నమోదయింది.మే 13న పోలింగ్ జరిగింది.

జూన్ 4న ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో కూడా ఎవరు అధికారంలోకి వస్తారన్నదాని విషయంలో టెన్షన్ నెలకొంది.ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ జూన్ మొదటి తారీకు సాయంత్రం 6:30 తర్వాత విడుదల చేయాలని ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం
Advertisement

తాజా వార్తలు