మంచి పని కోసం ట్రాఫిక్‌ను ఆపిన జపనీస్ వ్యక్తి.. వీడియో చూస్తే ఫిదా..

జపాన్ ప్రజలు పాటించే సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫిదా అవుతుంటారు.ఎందుకంటే ఈ సంస్కృతి గౌరవం, క్రమశిక్షణపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

ఈ లక్షణాలు జపనీయుల ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తాయి.వారు ఒకరి పట్ల ఒకరు విధేయత చూపుతారు, ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనను పాటిస్తారు, తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఇక జపాన్‌లో( Japan ) శుభ్రతకు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు.ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు, పదార్థాలను రీసైకిల్ చేయడం, వ్యర్థాలను తగ్గించడం వంటి చర్యలు కూడా చేపడుతుంటారు.

ఈ శ్రద్ధ వారి రోజువారీ జీవితంలో కూడా కనిపిస్తుంది.నడవడం, వాహనం నడపడం, సైకిల్ తొక్కడం వంటి విషయాలలో కూడా వారు క్రమశిక్షణతో ఉంటారు.

Advertisement

జపాన్‌లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు.తాజాగా ఒక వ్యక్తి వాన్ డ్రైవర్( Van Driver ) కోసం ఒక వ్యక్తి మంచి పని చేసి సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు.

ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వైరల్ అయ్యింది.దానిలో ఎంతో నేర్పుగా ఒక వ్యక్తి ట్రాఫిక్( Traffic ) మేనేజ్ చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు.ఆ వీడియోలో ఒక రోడ్డులో వాహనాలు వరుసగా వెళ్తున్నాయి.

అయితే ఆ రోడ్డుపైకి ఎక్కి వెళ్లాలని ఒక వ్యాన్ డ్రైవర్ పక్కనే ఉన్న రోడ్డులో సహనంగా వెయిట్ చేస్తున్నాడు.ఇది గమనించిన ఒక వ్యక్తి ఆగని ట్రాఫిక్ ను చక్కని సంకేతంతో నిలిపివేస్తాడు.

డ్రైవర్( Driver ) రోడ్డు పైకి తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తాడు.ఐదు నిమిషాలు చూసిన నెటిజన్లు వాహనాలను ఆపిన డ్రైవర్లకు, వాటిని ఆగమని సంకేతం ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేశారు.

చిగుళ్ల నుంచి తరచూ రక్తం వస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఆ విషయంలో ఎన్టీఆర్ అసలు మనిషే కాదు... సంచలనంగా మారిన అజయ్ కామెంట్?

‘@రెయిన్‌మేకర్ 1973’ అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఒక్క రోజులోనే సూపర్ పాపులర్ అయింది.

Advertisement

ఈ వీడియోలో చూపించిన జపాన్‌ సంస్కృతిలోని( Japan Culture ) క్రమశిక్షణ, గౌరవం ప్రపంచ వ్యాప్తంగా వీక్షకుల మన్ననలు అందుకుంది.దీంతో ఈ వీడియోకు కోట్లాది వ్యూస్ వచ్చాయి.వీడియో చూసిన వారు దానిలో కనిపించే మర్యాద, ఉన్నత స్థాయి కస్టమర్ సర్వీస్‌ పట్ల తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్లు పెట్టారు.

తాజా వార్తలు