మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‎ముఖ్‎కు ఊరట

మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‎ముఖ్‎కు ఊరట లభించింది.

దేశ్‎ముఖ్‎ బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ క్రమంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.మనీలాండరింగ్ కేసులో దేశ్‎ముఖ్‎కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈడీ కేసులో దేశ్‎ముఖ్‎కు బెయిల్ లభించినప్పటికీ గత ఏడాది ఏప్రిల్ లో అతడిపై నమోదైన సీబీఐ కేసుకు సంబంధించి ఇంకా కస్టడీలోనే ఉన్నట్లు సమాచారం.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement