రంగా హత్యపై మాజీమంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.వంగవీటి రంగాను టీడీపీ ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు.

రంగాను రాజకీయంగా ఎదుర్కొలేక చంపేశారని చెప్పారు.రంగా పేరు చెప్పుకోని ఇప్పటికీ టీడీపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

రంగాను తొక్కేయాలని టీడీపీ అడుగడుగునా ప్రయత్నించిందన్నారు.అది సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డు తొలగించుకుందని తెలిపారు.

ఓట్ల కోసం రంగా పేరును టీడీపీ వాడుకుంటోందని మండిపడ్డారు.గుడివాడలో నిన్న జరిగింది పార్టీల గొడవ కాదని చెప్పారు.

Advertisement

రావి - రంగా అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ అని వెల్లడించారు.ఈ క్రమంలో రావి వెంకటేశ్వర రావు తమపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యనించారు.

Advertisement

తాజా వార్తలు