బీజేపీ లోకి మాజీ హీరోయిన్ ? చేరికలతో ఫుల్ జోష్ 

చేరికలతోనే పార్తీని బలోపేతం చేయవచ్చనే ఆలోచనకు వచ్చిన బీజేపీ ( BJP party )ఆ వ్యవహారాలపైనే పూర్తిగా దృష్టి సారించింది.

తెలంగాణలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలోపేతం కావడం, బిఆర్ఎస్ ( BRS party )బిజెపిలలోనూ అసంతృప్తి నాయకులు పెద్ద ఎత్తున చేరుతుండడంతో కాంగ్రెస్లో వచ్చాను కనిపిస్తోంది టిఆర్ఎస్ కు ప్రత్యామ్ కాంగ్రెస్సే అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళుతూ ఉండడంతో బిజెపి కూడా అలర్ట్ అయింది చేరికలతో పార్టీలో జోష్ పెంచాలని నిర్ణయించుకుంది .

ఈ మేరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ లలోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని పార్టీలో చేర్చుకునే వ్యూహానికి తెర తీసింది.దీంతోపాటు రాష్ట్ర నాయకత్వం మార్పు తర్వాత భారీగా చేరికలపైనే దృష్టి సారించింది.

బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ లలోని మాజీ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విధంగా వారితో సంప్రదింపులు చేపట్టింది.

Ex-heroine Into Bjp Full Josh With Additions, Telangana Bjp, Bandi Sanjay, Ki

నిన్ననే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ , మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి , మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి,  జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్ జైపాల్ రెడ్డి ఢిల్లీ వేదికగా జాతీయ నాయకుల సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు.ఇదేవిధంగా మరికొంతమంది కీలక నేతలను పార్టీలో చేర్చుకునే విధంగా ప్లాన్ చేసారు.రేపు సోమవారం మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Advertisement
Ex-heroine Into BJP? Full Josh With Additions, Telangana BJP, Bandi Sanjay, Ki

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావుతో పాటు , బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె భర్త మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Ex-heroine Into Bjp Full Josh With Additions, Telangana Bjp, Bandi Sanjay, Ki

సినీనటి మాజీ ఎమ్మెల్యే జయసుధ ( Jayasuda )తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.దీంతో ఆమె బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది.పార్టీలో చేరితే ఏ ప్రాధాన్యం ఇస్తాము అనే విషయం పైన చర్చించినట్లు సమాచారం .మరో వారం రోజుల్లో ఢిల్లీకి వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో జయసుధ చేరనున్నట్లు సమాచారం.ముషీరాబాద్ లేక సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచన తో ఆమె ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు