రామాయణ మహాభారతాల్లో ఉన్న అసలు మాహిష్మతి ? దాని చరిత్ర ఏమిటి ?

"మాహిష్మతి .సామ్రాజ్యం .

ఆస్మాకం .

అజేయం" అంటూ బాహుబలి మొదటిభాగం ఆడియో విడుదల అయినప్పటినుంచి పాడకుంటున్నాం.మనవరకు అయితే ఈ మాహిష్మతి అనే సామ్రాజ్యం పేరు వినడం అప్పుడే మొదటిసారి.

సినిమా చూసాక మాహిష్మతి నిర్మాణాన్ని చూసి అబ్బురపోయాం.రాజమౌళి ఊహాశక్తిని చూసి వందల కోట్లు బహుమానంగా ఇచ్చేసాం.

కాని ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాహిష్మతి అనే పేరుతొ నిజంగానే ఏదైనా రాజ్యం ఉందొ లేదో ? మాహిష్మతి అనే పేరుతో నిజంగానే రాజ్యం ఉండేది.ఎక్కడో కాదు మన దేశంలోనే.

Advertisement

అయితే ఆ రాజ్యం వేరు రాజమౌళి మాహిష్మతి వేరు.రాజ్యం పేరు మాత్రమే వాడుకున్నారు.

భావన నిర్మాణాలు, యుద్దరీతులు .అన్ని రాజమౌళి సృష్టించినవే.కంప్యూటర్ గ్రాఫిక్స్ తో సృష్టించిన మాహిష్మతికి, అసలైన మాహిష్మతికి చాలా తేడాలున్నాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం.అసలైన మాహిష్మతి రాజ్యం గురించి ముచ్చట్లు తెలుసుకోండి.

రామాయణంలో మాహిష్మతి వివరాలున్నాయి తెలుసా ? ఇక్ష్వాకు కొడుకు దశాశ్వ మాహిష్మతిని పరిపాలిస్తున్నప్ప్పుడు రావణుడు మాహిష్మతిపై దాడికి దిగాడట.పద్మపురాణంలో కూడా మాహిష్మతి గురించి సమాచారం ఉంటుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వారంలో 3 సార్లు ఈ మిల్క్ షేక్‌ను తీసుకుంటే మీ ఆరోగ్యం ప‌దిలం!

దీనిని నిర్మించిన రాజు పేరు మాహిష అని కొన్న్ని గ్రంధాలలో ఉంటే, ఆ రాజు పేరు మాహిష్మాంత్ అని మరికొన్ని గ్రంథాల్లో ఉంది.ఇద్దరు ఒకరేనా కాదా అనే విషయం తెలియదు.

Advertisement

కాని ఎవరు నిర్మించినా, ఆ రాజు పేరు మీదే దీనికి మాహిష్మతి అనే పేరు వచ్చింది అనే సుస్పష్టం అవుతోంది.భారతదేశంలో మాహిష్మతి అనే రాజ్యం ప్రాచీనయుగంలో ఉండేది.

ఇది మధ్యభారతంలో నర్మద నది ఒడ్డున ఉండేది.ఇది విష్ణుపురాణం, మహాభారతంలో పేర్కొనబడిన అవంతి రాజ్యంలో ఒక దక్షిణ నగరం.

హైహయాస్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు మాహిష్మతి, ఉజ్జయిని రెండు ప్రధాన నగరాలుగా ఉండేవి.కొంతకాలం తరువాత మాహిష్మతి అనుప రాజ్యానికి రాజధానిగా మారింది.

ఈ రాజ్యం గురించి మహాభారతంలో ఆనవాళ్ళు దొరుకుతాయి.మన తెలుగు గ్రంధాలలో కూడా మాహిష్మతి గురించి ఉండటం విశేషం.

ఆంధ్రమహాభారతంలోని సభా పర్వాన్ని చూస్తే మాహిష్మతిని నిలా అనే నిశాడదేశ రాజు పరిపాలించేవాడని, ఆ రాజు కూతురిని చూసి సూర్యదేవుడు ప్రేమలో కూడా పడ్డాడని ఉంటుంది.అయితే సూర్యదేవుడు ఒక బ్రహ్మణరూపంలో రూపంలో ఆమెతో చెలిమి చేస్తాడట.

అది చూసిన రాజు ఆ బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోకుండా అతడిని బంధించాలని చూసినా, ఆ తరువాత సూర్యభగవానుడు అని తెలుసుకొని క్షమాభిక్ష అడుగుతాడట.ఈ మాహిష్మతి 6వ శతాబ్దం, 7వ శతాబ్దం సమయంలో కలుచూరి రాజుల రాజధానిగా ఉండేది.

పాళీ రచనల్లో, సంస్కృత రచనల్లో దీని గురించి రాసి ఉంటుంది.ఆరకంగా నిజంగానే ఉన్న మాహిష్మతి పేరుని వాడుకొని, సరికొత్త ప్రపంచం సృష్టించి, రెండు భాగాలు కలిపి 2200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు మన జక్కన్న.

అన్నట్టు చెప్పడం మరచిపోయాం .ఈ మాహిష్మతిని ఇప్పుడు మహేశ్వర్ అంటున్నారు.ప్రస్తుతం ఈ ప్రాంతంలో మధ్యప్రదేశ్ కిందికి వస్తుంది.

తాజా వార్తలు