Rajya Sabha elections : రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధం..!

రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) సర్వం సిద్ధం అవుతోంది.

దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా.

ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగియనుంది.ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

కాగా తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీతో( Congress Party ) పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ఖరారు చేసింది.

ఈ క్రమంలోనే అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానాలు ప్రకటించాయి.దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా సీనియర్ నేత రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు అవకాశం ఇచ్చింది.అటు బీఆర్ఎస్ నుంచి మరోసారి వద్దిరాజు రవిచంద్రకే అవకాశం దక్కింది.

Advertisement

ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇవాళ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు