తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అందరికీ తెలిసిందే.
గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చే విషయంపై కాకుండా, మిగతా అన్ని విషయాల పైన ఆ పార్టీ నాయకులు పోరాడుతుండడం వంటివి తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.
ముఖ్యంగా పార్టీలో ఆధిపత్య ధోరణి పెరిగిపోవడం , గ్రూపు రాజకీయాలు వంటి వాటి ప్రభావంతో పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి రావడం ఇవన్నీ కాంగ్రెస్ అదృష్టం సీరియస్గా తీసుకుంది.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీస్తున్న క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి పునర్ వైభవం సంపాదించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అవుతోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒకప్పుడు బలంగా ఉంది.అయితే ఇప్పుడు కాంగ్రెస్ బాగా బలహీనం అవడంతో బిజెపి బాగా బలం పుంజుకుంది.
ముఖ్యంగా తెలంగాణలో బిజెపి ప్రభావం అంతంతమాత్రంగా ఉండగా, టిఆర్ఎస్కు ప్రధాని పోటీదారుగా కాంగ్రెస్ ఉండేది.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.
టిఆర్ఎస్ కు ప్రధాన పోటీదారుగా బిజెపి మారగా, కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా తయారైంది.ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో కొద్దో గొప్ప చేరికలు కనిపించినా, ముఖ్యమైన నాయకులంతా బిజెపిలోకి వలస వెళ్తుండడం కాంగ్రెస్ కు కలవరం పుట్టిస్తోంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ను ఒక గాడిలో పెట్టేందుకు తమిళనాడు కు చెందిన మాణిక్యం ఠాగూర్ కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించారు.
ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దగా మార్పులు కనిపించకపోవడం, గ్రూపు రాజకీయాలు మరింత ఎక్కువ అవ్వడం, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన వెనకేసుకొస్తున్నట్లుగా సీనియర్ నాయకులు ఫిర్యాదులు చేయడం దీనికి తగ్గట్లుగానే ఒక్కొక్క సీనియర్ నాయకుడు పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు .ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీకి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది.తెలంగాణ బాధ్యతలే కాకుండా , దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ఇప్పుడు ప్రియాంక చేతుల్లో పెట్టారు.
ఈ మేరకు ఆమె దక్షిణాది రాష్ట్రాల్లో త్వరలోనే పర్యటన చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ కు మేలే జరుగుతున్నా ,తెలంగాణలో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిన తర్వాత ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగడం వల్ల లాభం ఏముంటుంది అనే ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ ఉండేదని , కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించింది.సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రియాంక గాంధీ ఎంతవరకు తెలంగాణ కాంగ్రెస్ ను ఒడ్డున పడేస్తారు అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy