అక్క‌డ టీడీపీలో అంద‌రూ అట్ట‌ర్ ప్లాప్... మ‌హామ‌హులు మ‌టాష్ ?

టీడీపీ ఆవిర్భ‌వించిన కృష్ణాజిల్లాలో ప్ర‌స్తుతం ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది?  తాజాగా ముగిసిన నాలుగు ద‌శ ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త ఉంద‌నేది ఆస‌క్తిగా మారింది.

ఇత‌ర జిల్లాల ‌తో పోల్చుకుంటే.

టీడీపీకి మ‌ద్ద‌తు దారులు.అదేస‌మ‌యంలో ఆ పార్టీకి ప్రత్య‌ర్థులు కూడా ఎక్కువ‌గా ఉన్న‌ది ఈ జిల్లాలోనే.

Everyone In The TDP There Utter Flop ... Mahamahulu Matash?,ap,ap Political News

అలాంటి జిల్లాలో పార్టీ చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది.అయితే.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల నుంచి కూడా పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది.నాయ‌కులు చేజారిపోవ‌డంతోపాటు.

Advertisement

నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోగా.కొంద‌రు సైలెంట్ కావ‌డం వంటివి పార్టీకి తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామాలుగా మారాయి.

ఇక‌, ఇటీవ‌ల ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ కృష్నాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది.మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రాతిని ధ్యం వ‌హించిన మైల‌వ‌రం,.

ఈ చుట్టుప‌క్క‌ల ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు.జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ‌ల్లోనూ పార్టీ ఆశించిన విధంగా పంచాయ‌తీల్లో ప‌ట్టు సాధించ‌లేక పోయింది.

ఇక‌, మ‌రో మంత్రి కొల్లు ర‌వీంద్ర ప్రాతినిధ్యం వ‌హించిన మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.గుడివాడ‌, మ‌చిలీప‌ట్నం, నూజివీడు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..

ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో పంచాయ‌తీ ప‌ట్టు సాధించేలేక పోయింది.నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీపై అభిమానం ఉన్న పాత‌త‌రం వారు కూడా ఈ ద‌ఫా దూర‌మ‌య్యారు.

Advertisement

దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇలా జ‌రిగింది? అంటే.నాయ‌కులు పార్టీ ప్ర‌యోజ‌నాన్ని ప‌క్క‌న పెట్టార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం.పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు .వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగానే ఇప్పుడు పార్టీ ని ప‌ట్టించుకునే తీరికి ప్ర‌జ‌ల‌కు లేకుండా పోయింద‌ని అంటున్నారు.అదేస‌మ‌యంలో నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది.

వెర‌సి మొత్తంగా మాజీ ఎంపీలు.మాజీ మంత్రులు  ఉన్న‌ప్ప‌టికీ.

జిల్లాలో ప‌ట్టు సాధించ‌లేక పోయార‌నేది వాస్త‌వం.

తాజా వార్తలు