Mimicry Video : మిమిక్రీ అమ్మ మొగుడిని ఎపుడైనా చూసారా? అయితే ఇక్కడ చూడండి!

మిమిక్రీ అంటే ఏమిటో తెలియని వారుండరు.మీలో ప్రతీ ఒక్కరు కనీసం ఒక్కసారి అయినా మిమిక్రీని చూసి ఆనందించే వుంటారు.

మనకు తెలిసిన ప్రముఖ వ్యక్తుల స్వరాన్ని అనుకరించి మాట్లాడడమే మిమిక్రి.మిమిక్రీ చేయడం అనేది ఒక కళ.అది అందరికీ సాధ్యపడదు.ఏ కొద్దిమందికో అది సాధ్యపడుతుంది.

ఇందులో జంతువులను పక్షుల శబ్దాలను కూడా అనుకరించడం ఒకటి.అయితే ఇది అందరి మిమిక్రీ ఆర్టిస్టులకు సాధ్యపడదు.

అలాంటి శబ్దాలను కూడా సునాయాసంగా చేస్తున్నాడు వీడియోలో వున్న ఓ యువకుడు.ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

సలీమ్ ఎరాకీ అనే వ్యక్తి పోస్ట్ చేసిన ఈ వీడియోకి నెట్టింట్లో విశేష స్పందన వస్తోంది.ఇప్పటి వరకూ ఈ వీడియో 2.9 మిలియన్ల వీక్షణలు పొందగా 97 వేలకు పైగా లైకులు వచ్చాయి.కాగా ఈ వీడియోలోని యువకుడు చేసిన శబ్దాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే.ఆ యువకుడు ఓ స్టూల్ మీద కూర్చుని.

తన ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్పిన పక్షుల, జంతువుల శబ్దాలు యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తుంన్నాడు.

అతను చేసిన మిమిక్రీకి ఎదుట నిలబడిన వ్యక్తి కూడా ఫిదా అయిపోయాడు.‘‘ చాలా బాగుంది.బాగా చేశావు’’ అని అంటూ అతగాడిని పొగడటం మనం చూడవచ్చు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఇక అతని మిమిక్రీ టాలెంట్‌ను చూసిన నెటిజన్లు లోకల్ టాలెంట్‌ను ప్రోత్సాహించాలంటూ కింద కామెంట్లు పెడుతున్నారు.ఓ నెటిజన్ అయితే ‘‘మీ టాలెంట్‌కి ఫిదా అయిపోయా భయ్యా, ఒప్పుకొని తీరాలి మీ టాలెంట్ గొప్పదని!’’ అని అతగాడిని ఆకాశానికెత్తేసాడు.

Advertisement

అనేకమంది నెటిజన్లు తమ స్పందనను, అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.