ఇంత చేసినా.. టీడీపీని వేధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే..!

స్థానిక ఎన్నిక‌ల‌కు సుప్రీం కొర్టు కూడా పచ్చజెండా ఊపేసింది.ఇక‌, ఎన్నిక‌ల‌కు అంద‌రూ క‌ద‌లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.ఆది నుంచి కూడా స్థానిక ఎన్నిక‌ల కోసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌ట్టుబ‌డుతోంది.

ఇక‌, ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు వ‌ద్ద‌న‌డాన్ని తీవ్రంగా త‌ప్పుప‌డుతూ.నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

స్థానిక ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని, క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని ఎక్క‌డ ఓడిపోతామో.అనే భ‌యంతో ఎన్నిక‌లు వ‌ద్దంటోంద‌ని టీడీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

Even So These Are The Questions Plaguing Tdp-ap-ap Political News-latest News-t
Advertisement
Even So These Are The Questions Plaguing TDP-ap-ap Political News-latest News-t

తాజాగా చంద్ర‌బాబు సైతం సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు.ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము, ధైర్యం లేక‌పోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ ఇలా చేస్తున్నారని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు.అయితే ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్న‌త న్యాయ‌స్థాన‌మే ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం పంచాయ‌తీకి రెడీ అవుతోంది.

ఇక‌, ఇప్పుడు టీడీపీకి ఇంత చేసినా ఫ‌లితం ద‌క్కుతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ప్ప‌ మిగిలిన చోట్ల పార్టీకి బ‌లం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

పైగా పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో చంద్ర‌బాబు వైఖ‌రిని ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్పుబడుతున్నారు.ఆయ‌న హ‌యాంలోనే జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లను ఇప్ప‌టి వ‌ర‌కుఎందుకు ఆపార‌నే ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ నేత‌ల వ‌ద్ద స‌మాధానం లేదు.

ఇక‌, ఇప్పుడు కూడా ప్ర‌జారోగ్యం కోసం ప్ర‌భుత్వం ఓవైపు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతుండ‌గా.టీడీపీ మాత్రం ప‌ట్టు బడుతుండ‌డాన్ని ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?

ఇక‌, పార్టీ ప‌రిస్థితి చూస్తే.క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేకుండా పోయింది.

Advertisement

అదేస‌మ‌యంలో ఇప్పుడు గెలిచిన నాయకులు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రెండేళ్లు అయినా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన పాపాన పోలేదు.స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోలేదు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ఆశిస్తున్న విధంగా అయితే ఫ‌లితం ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.దీంతో ఇంత చేసినా టీడీపీని ఈ స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా వార్తలు