సిపిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో వివి లక్ష్మీనారాయణ చూపించిన చొరవ, ఆయన దర్యాప్తు తీరు ఇవన్నీ ఆయనకు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతలు సంపాదించిపెట్టాయి.
ముఖ్యంగా జగన్ అక్రమస్తుల కేసులో లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరుపై ఆయనకు ప్రశంసలు దక్కాయి.
ఇక ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుని రాజకీయాల వైపు లక్ష్మీనారాయణ అడుగులు వేశారు.చాలా కాలం పాటు ఏ పార్టీలో చేరాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.
సొంత పార్టీ పెడతారని ప్రచారం జరిగింది.కానీ చివరకు 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.
ఇక తర్వాత జనసేన లో యాక్టివ్ గానే కనిపించినా, చివరకు పవన్ వైఖరి నచ్చక లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసి దూరంగా ఉంటున్నారు.సొంతంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు .2019 ఎన్నికల్లోను మళ్ళీ ఎంపీగా పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో లక్ష్మినారాయణ ఉన్నారు.అయితే సొంతంగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు.
అందుకే ఆ సాహసం చేసేందుకు ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తి చూపించడం లేదు.పోనీ టిడిపిలో చేరదామా అంటే గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో టిడిపి తో తనకు సంబంధాలు ఉన్నాయన్నట్లుగా వైసిపి చేసిన విమర్శలు లక్ష్మీనారాయణకు గుర్తుకొస్తున్నాయి.
ఎలాగూ వైసీపీలో చేరే అవకాశం లేదు.చివరి ఆప్షన్ గా ఆయనకు జనసేన కనిపిస్తోంది.
కచ్చితంగా జనసేన నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాననే నమ్మకంతో లక్ష్మీనారాయణ ఉన్నారు.అయితే తనకు తానుగా మళ్లీ జనసేన లో చేరుతానని లక్ష్మీనారాయణ అడగలేకపోతున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జేడిని రమ్మని పిలిపించే ప్రయత్నము ఎలాగూ చేయరు.
దీంతో లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం సందిగ్ధం లో పడింది.ఇటీవల రణస్థలంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువ భేరీ సభ పై లక్ష్మీనారాయణ స్పందించారు.
రణస్థలంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో యువకులు ముందుకు వచ్చి తమ గళాన్ని వినిపించడం చాలా సంతోషకరమంటూ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.ఈ విధంగా జనసేనకు సానుకూలంగా ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆ పార్టీలో చేరుతానని నేరుగా పవన్ ను అడిగే ప్రయత్నం ఆయన చేయలేకపోతున్నారు.
.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy