లీడర్లు యాక్టివ్ గా ఉన్నా.. బీజేపీ లో కనిపించని ఆ సందడి ?

తెలంగాణలో అధికార పార్టీగా  జెండా ఎగురు వేసేందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ ప్రభావాన్ని తగ్గించేందుకు తెలంగాణలో బీఆర్ఎస్ ను  ఓడించడం ఒక్కటే మార్గమని కేంద్ర బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసిఆర్( KCR ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రాల వారీగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ,  బీఆర్ఎస్( BRS ) బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవన్నీ తమకు ఇబ్బందికర పరిస్థితిలను తీసుకువస్తాయనే బీజేపీ హై కమాండ్  తెలంగాణ పై ఇంతగా ఫోకస్ పెట్టింది.తెలంగాణలో పర్యటిస్తూ.

బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ బిజెపి బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

Even If The Leaders Are Active That Noise Which Is Not Seen In Bjp ,telangana B
Advertisement
Even If The Leaders Are Active That Noise Which Is Not Seen In BJP ,Telangana B

తెలంగాణ బిజెపి నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ,  నిత్యం ఏదో ఒక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న , బిజెపి పై జనాల్లో ఆదరణ పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు .ఎంతవరకు బాగానే ఉన్నా .బిజెపిలో ఆశించిన స్థాయిలో చేరికలు కనిపించకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.చేరికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) ను చేరికలు కమిటీ చైర్మన్ గా బిజెపి అధిష్టానం నియమించింది.

ఆయన ఆ పదవి తీసుకున్నా.చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, చేరే వారి వివరాలు ముందుగానే లీక్ కావడంతో,  బీఆర్ఎస్ , కాంగ్రెస్ లు అలెర్ట్అవుతూ తమ పార్టీల నుంచి నాయకులు వలస వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.

Even If The Leaders Are Active That Noise Which Is Not Seen In Bjp ,telangana B

దీనికి తోడు తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఈ మధ్యకాలంలో ఊపందుకోవడం,  ఆ ప్రభావం చేరికల పైన స్పష్టంగా కనిపిస్తుండడం తదితర కారణాలతో ఆశించిన స్థాయిలో చేరికలైతే బీజేపీలో కనిపించడం లేదు.మరో వైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడింది.ఈ సమయంలో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ ల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బిజెపి ఆశలు పెట్టుకున్న, ఆ ఆశలు పెద్దగా తీరడం లేదు.

తెలంగాణలో బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బిజెపి నేతలు చెబుతున్న,  దానికి తగ్గట్టు అయితే పెద్దగా కసరత్తు జరగడం లేదు.బిజెపిలో చేరికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను ఇటీవల కాలంలో నిర్వహించారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

అలాగే ఎక్కడికక్కడ నాయకులు పాదయాత్రలు చేపట్టారు .అయినా చేరికలు మాత్రం అంతంత మాత్రమే అన్నట్టు గా ఉండడం బిజెపి పెద్దలకు నిరాశ కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు