అప్పుడు వ్యతిరేకించినా... ఇప్పుడు బాబు కు తప్పడం లేదుగా ? 

గత వైసిపి ప్రభుత్వ హయాంలోని ఆనవాళ్లు ఏవి తమ ప్రభుత్వంలో కనిపించకూడదనే ఆలోచనతో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నా.

కొన్ని విషయాల్లో మాత్రం జగన్ పాలనను  అనుసరించక తప్పని పరిస్థితి .

ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను, పథకాలను ప్రస్తుతం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో వాటికే పేర్లను మార్చి కొన్ని అమలు చేస్తుండగా,  మరికొన్నిటిని యదవిధిగా అమలు చేస్తున్నారు.

గత వైసిపి ప్రభుత్వం లో జగన్( YS Jagan Mohan Reddy) తీసుకున్న నిర్ణయాలను,  అమలు చేసిన పథకాలను పూర్తిగా తీసివేసేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది.దీనికి కారణం ఆ పథకాలు, నిర్ణయాలు జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్లడమే.

వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే.  గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, అభివృద్ధి, సూచనలు, సలహాల కోసం పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేశారు.

Advertisement
Even If He Opposed It Then But Now CM Chandrababu Naidu Doesn't Care , TDP, Chan

వారు వారానికి ఒక్కసారైనా పాఠశాలకు వెళ్లి సౌకర్యాలను పరిశీలించి మార్పులను సూచించే విధంగా కమిటీలను ఏర్పాటు చేశారు.

Even If He Opposed It Then But Now Cm Chandrababu Naidu Doesnt Care , Tdp, Chan

 దానికి అనుగుణంగా పాఠశాలల్లో మార్పు,  చేర్పులు తీసుకువచ్చారు.టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమిటీలను ఎత్తివేస్తాడని అనుకున్నా.  పేరెంట్స్ కమిటీలను యధావిధిగా నే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

మొన్న గురువారం రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు తల్లిదండ్రులతోనే కమిటీలను కొనసాగించారు .వీటిలో ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా చూశారు.అలాగే సర్వేల విషయంలోనూ పాత విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

గతంలో కొన్ని దశాబ్దాలుగా భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి.వీటిని పరిష్కరించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

కేంద్రం సూచనల మేరకు జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ( AP Land Titling Act )ను తీసుకువచ్చింది.దీనికి ముందు భూములను రీ సర్వే చేశారు .

Advertisement

 ఏ ఏ భూములు ఎవరి పేరుతో ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు .వీటిని ఎన్నికలకు ముందు టిడిపి కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి అనుకున్నట్లుగానే రద్దు చేశారు.

ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సర్వే మాత్రం ఇప్పుడు కూడా కొనసాగిస్తూ చంద్రబాబు ( Chandrababu Naidu )ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆ చట్టాన్ని రద్దు చేసినా సర్వే మాత్రం యధావిధి గా కొనసాగిస్తోంది.

తాజా వార్తలు