మెగా ఫ్యామిలీ పై ఈగ కూడా వాళ్ళనివ్వరు... నాగబాబు షాకింగ్ కామెంట్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబి దర్శకత్వంలో చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దర్శక నిర్మాతలతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు అభిమానులను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే మెగా ఫ్యాన్స్ అందరూ చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇక్కడ మాత్రమే కాకుండా ఇండియాలో ఇంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఏ నటుడికి లేదని ఆయన తెలిపారు.చిరంజీవి అంటే అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

చిరంజీవి గారు ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా, ఎంతో వినయ విధేయుడుగా ఉంటారు.అయితే చిరంజీవి గురించి గానీ లేదా ఆయన ఫ్యామిలీ పై కానీ ఈగ వాలిన ముందుగా స్పందించేది ఆయన అభిమానులే.ఆయనని ఎవరైనా అనరాని మాటలు అంటే అభిమానులు ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు.

Advertisement

ఇలా మెగాస్టార్ గారిని అభిమానించే వారిలో తాను ముందు వరుసలో ఉంటానని, చిరంజీవి విధేయతను ఎవరైనా అవకాశంగా తీసుకుంటే మొదటగా రియాక్ట్ అయ్యేది తన అభిమానులేనట్టు ఈ సందర్భంగా నాగబాబు మెగా అభిమానుల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు