Etela Rajender : కాంగ్రెస్ గూటికి ఈటల రాజేందర్..!!

తెలంగాణ బీజేపీలో కీలక నేత ఈటల రాజేందర్( BJP Leader Etela Rajender ) పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవలే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నేలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే చర్చ జోరుగా నడుస్తోంది.ఈటల రాజేందర్ త్వరలోనే హస్తం గూటికి చేరతారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా( Karimnagar Congress Candidate ) పోటీ చేస్తారనే పార్టీ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.

అయితే తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల ఓటమి పాలైన సంగతి తెలిసిందే.కాగా దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

Advertisement

తాజా వార్తలు