కేసీఆర్‌పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వాటికి స‌మాధానం చెప్ప‌డం క‌ష్ట‌మే..!

తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీల‌కూ పెద్ద ప‌రీక్ష‌గానే మారింది.

మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్, బీజేపీకే ఈ ఉప ఎన్నిక అత్యంత కీల‌కంగా మారింది.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న‌కు కూడా ఈ ఉప ఎన్నిక పెద్ద స‌వాల్‌గానే మారింది.ఈ నేప‌థ్యంలో స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ కేసీఆర్‌కు స‌మాధానం చెప్ప‌లేని ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి అదే స్థాయిలో విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు విసిరారు.

మొన్న‌టికి మొన్న కేసీఆర్ ద‌ళితుల కోసం ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం అందిర‌కీ తెలిసిందే.అయితే దీనిపై ఈట‌ల రాజేంద‌ర్ స్పందిస్తూ కేసీఆర్‌కు అస‌లు ద‌ళితులంటేనే లెక్క లేద‌ని వారిని ఎప్పుడూ అవమానించే వాడ‌ని చెప్పారు.

అంతే కాదు కేసీఆర్ కులాన్ని బ‌ట్టి వ్య‌క్త‌కి మ‌ర్యాద ఇచ్చే నాయ‌కుడ‌ని, ఆయ‌న‌కు త‌క్కువ కులం వారంటే అస‌హ్యం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.అంతే కాదు కేసీఆర్ స‌మాధానం చెప్ప‌లేని ప్ర‌శ్న‌ల‌ను మ‌రోసారి సంధించారు.

Etela Rajender Sensational Comments On Kcr It Is Difficult To Answer Them , Ete
Advertisement
Etela Rajender Sensational Comments On KCR It Is Difficult To Answer Them , Ete

కేసీఆర్‌కు నిజంగానే ద‌ళితులు, గిరిజ‌నులు అంటే అంత గౌరవం ఉంటే సీఎంవో ఆఫీసులో ఒక్క ఐఏఎస్ ఆఫీస‌ర్ అయినా ద‌ళిత‌, గిరిజ‌న కులానికి చెందిన వారున్నారా అని ప్ర‌శ్నించారు.ఉంటే సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై సమాధానం చెప్ప‌డం టీఆర్ ఎస్‌కు పెద్ద స‌వాలే అని చెప్పాలి.

ఎందుకంటే ఈట‌ల చేసిన విమ‌ర్శ‌ల్లో ఏ ఒక్క‌టీ త‌ప్పుకాదు.మ‌రి ఈట‌ల వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన స‌మాదానం చెప్ప‌లేని టీఆర్ ఎస్ నేత‌లు ఈ వ్యాఖ్య‌ల‌పై ఏమైనా స్పందిస్తారా అనేది ప్ర‌శ్న‌గానే మారింది.

ఏదేమైనా ఈట‌ల రాజేంద‌ర్ మాత్రం స‌రైన స‌మ‌యంలో స‌రైన ప్ర‌శ్న‌లు వేస్తూ టీఆర్ ఎస్‌కు స‌వాల్ విసురుతున్నార‌నే చెప్పాలి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు