ఏ పార్క్‌లోకి వెళ్లాలన్నా టికెట్‌ కొనాలి, కాని ఆ పార్క్‌లో బట్టలిప్పాలి.. వింత పార్క్‌పై కథనం

ప్రపంచంలోని ఏ పార్క్‌కు వెళ్లాలన్నా కూడా టికెట్‌ కొనాలి, కొన్ని పార్క్‌ల్లో ఫ్రీగానే వెళ్లి ఎంజాయ్‌ చేయవచ్చు.

కాని ఆ పార్క్‌లో మాత్రం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి టికెట్టు కొనుగోలు చేయడంతో పాటు ఒంటి మీద నూలు పోగు లేకుండా లోనికి వెళ్లాలి.

గేట్‌ వద్దే పూర్తిగా డ్రస్‌లు విప్పేయాల్సిందే.న్యూడ్‌ గా లోనికి వెళ్లిన వారికి అనేక రకాల గేమ్స్‌ ఉంటాయి.

అవన్ని కూడా శృంగార భరిత గేమ్స్‌ అవ్వడంతో ఈ పార్క్‌పై అందరి దృష్టి పడుతోంది.ఈ పార్క్‌లో ఆడే ఆటలపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినా కూడా స్థానిక ప్రభుత్వం తట్టుకుని ఈ పార్క్‌ను ప్రారంభించేందుకు సిద్దం అయ్యింది.

ఈ వింత పార్క్‌ బ్రెజిల్‌ లోని సావో పాలో ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది.దాదాపు 160 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

పార్క్‌లో మినీ థియేటర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ ఇంకా పలు గేమ్స్‌ కోస ఏర్పాట్లు చేశారు.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పార్క్‌కు వ్యతిరేకంగా కామెంట్స్‌ వచ్చినా కూడా స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ పార్క్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసింది.

పూర్తి న్యూడ్‌గా పార్క్‌లో ఉండి, అనేక శృంగార గేమ్స్‌ ఆడుతున్నా కూడా అక్కడ మాత్రం శృంగారానికి నో ఛాన్స్‌.ఒక వేళ శృంగారం చేసినట్లుగా తెలిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

శృంగారపరమైన ఎన్నో గేమ్‌లు ఆడుతారు కాని అక్కడ శృంగారంకు మాత్రం నో ఛాన్స్‌ అంటూ ఉండటం వల్ల ఎంతో మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఇంత చేసిన వారు ఆ ఒక్కదానికి కూడా అక్కడ ఏదో ఒక ఏర్పాటు చేస్తే బాగుండేది కదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే మాత్రం ఈ పార్క్‌ను బ్యాన్‌ చేయాల్సిందే అంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.

చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు
Advertisement