పాస్‌పోర్ట్ లేకుండా ఇండియాలోకి ఎంట్రీ.. బంగ్లా యూట్యూబర్‌ షాకింగ్ ఇన్ఫో..

"DH ట్రావెలింగ్ ఇన్ఫో"( DH Traveling Info ) అనే బంగ్లాదేశ్ యూట్యూబర్ చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ఎలా ప్రవేశించాలో వివరిస్తున్న ఓల్డ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది భారతదేశ ప్రజలలో తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తోంది.

వీడియోలో, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రజలకు ఎటువంటి డాక్యుమెంటేషన్, వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదని అతను పేర్కొన్నాడు.అతను భారతదేశానికి సరిహద్దుగా ఉన్న బంగ్లాదేశ్‌లోని సునమ్‌గంజ్ జిల్లా, సిల్హెట్ డివిజన్‌లో ( Sunamganj District, Sylhet Division )స్వయంగా వీడియో రికార్డ్ చేశాడు.

అతను భారతదేశానికి దారితీసే రహదారిని చూపించాడు.ఈ మార్గంలో వెళ్లే వారు BSF అధికారులతో వ్యవహరించడం వంటి పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించాడు.

వీడియో కొనసాగుతుండగా, అతను భారతదేశంలోని BSF శిబిరాన్ని, దేశంలోకి ప్రవేశించడానికి ఉపయోగించే కొన్ని సొరంగాలను చూపాడు.చివరికి భారత్‌లో అక్రమంగా ప్రవేశించి బంగ్లాదేశ్ ప్రతిష్టను దెబ్బతీయవద్దని ప్రజలను హెచ్చరించాడు.దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పటి నుంచి, దీనికి 200,000 వ్యూస్, 7,000 లైక్‌లు, అనేక కామెంట్లు వచ్చాయి.చాలా మంది సరిహద్దు సమస్యపై తమ ఆందోళనలను వ్యాఖ్యలలో వ్యక్తం చేశారు.

"BSFకి ఇది తెలియదా? యూట్యూబర్‌కి మార్గం తెలిస్తే, అందరూ చేస్తారు.సరిహద్దులో BSF ఏమి చేస్తోంది?" అని ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు "అవును, వారికి వీసాలు లేదా పాస్‌పోర్ట్‌లు అవసరం లేదు.వారు సొరంగం దాటిన తర్వాత, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు కొనుగోలు చేస్తారు.

రండి, ఇండియాలో ఓటు వేయండి" అని ఇంకొకరు ఘాటుగా కామెంట్ పెట్టారు."అతను దీన్ని చూపించి మంచి పని చేశాడు.

ఇప్పుడు మనం ఈ ప్రాంతాలను బలోపేతం చేయవచ్చు" అని ఇంకొందరు పేర్కొన్నారు.

అయ్యయ్యో.. పెళ్లిపీటలపై నిద్రపోయిన పెళ్లికూతురు.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు